![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -532 లో.. జ్యోత్స్నని తీసుకొని కార్తీక్ ఇంటికి బయల్దేతాడు కార్తీక్. జ్యోత్స్న కార్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తుంది. మెల్లిగా వెళ్ళమని దశరథ్ చెప్తాడు. నా మైండ్ ప్రశాంతంగా లేదని జ్యోత్స్న అంటుంది. కార్ ఒక దగ్గర ఆగమని చెప్తాడు. రెండు ఐస్ క్రీమ్ లు కొనుక్కొని తీసుకొని వస్తాడు. ఎవరికి ఆ దీప కూతురుకా అని జ్యోత్స్న అనగానే కాదు నా కూతురికి అని దశరథ్ అంటాడు. జ్యోత్స్న కి ఐస్ క్రీమ్ ఇస్తాడు. తనతో దశరథ్ చాలా ప్రేమగా మాట్లాడతాడు. నువ్వు నా కూతురువి కాదని దశరథ్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది.
ఒకప్పుడు నా కూతురు.. నాతో ప్రేమ గా ఉండేది.. అల్లరి చేసేది కబుర్లు చెప్పేది.. ఇప్పుడు అలా ఉండడం లేదని దశరథ్ అంటాడు. ఎప్పుడు నేను, మీ అమ్మ.. నీ హ్యాపీనెస్ కోరుకుంటామని దశరథ్ అంటాడు. నువ్వు పెళ్లి చేసుకోమని దశరథ్ అనగానే సరే డాడీ మీ ఇష్టం అని జ్యోత్స్న అంటుంది. దాంతో దశరథ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత నేను ఇంటికి వెళ్తాను డాడీ అని జ్యోత్స్న అంటుంది. లేదమ్మ నువ్వు నాతో రావాలని కార్తీక్ ఇంటికి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు నాకు తల తిరుగుతుంది.. దీప జ్యూస్ తీసుకొని రమ్మని సుమిత్ర అనగానే దీప, అనసూయ కిచెన్ లోకి వెళ్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని పారిజాతం తన వెనకాలే వెళ్తుంది. కాంచన, శివన్నారాయణ, కార్తీక్ మాట్లాడుకుంటారు. నువ్వు శ్రీధర్ ని క్షమించొచ్చు కదా అని శివన్నారాయణ అంటాడు.
నాన్న నా కళ్ళతో నన్ను నిలబెట్టగలవా అని కాంచన అనగానే శివన్నారాయణ ఎమోషనల్ అవుతాడు. అప్పుడే దశరథ్, జ్యోత్స్న ఎంట్రీ ఇస్తారు. దశరథ్, పండ్లు చీర తీసుకొని వస్తాడు. అదేంటీ అని కార్తీక్ అడుగుతాడు. దీప మా కూతురు అనుకొని పెళ్లి చేసాం.. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ కాబట్టి పసుపు కుంకుమ సారె తీసుకొని వచ్చామాని దశరథ్ అంటాడు. దీపకి అవన్నీ ఇచ్చి. సుమిత్ర, దశరథ్ ఆశీర్వదిస్తారు. ఇక దీప నువ్వు పనికి వద్దని దశరథ్ అనగానే దీప షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |